భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య గంట సేపు హాట్ లైన్ చర్చలు
అమరావతి: భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య హాట్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం 5 గంటలకు చర్చలు జరిగాయి.. భారత ఆర్మీ DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ సైన్యం DGMO మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లాలు హాట్‌లైన్ చర్చల్లో పాల్గొన్నారు..పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పపడడంపై భారత్,,పాక్ ను ప్రశ్నించింది..ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ కు సహకరించాలని DGMOను కోరారు..భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పపడే సాహసం చేయవద్దని,,భారత భూభాగంలోకి డ్రోన్లు అనుమతించమని ఇండియా తేల్చి చెప్పింది..తొలి రౌండ్ చర్చలు దాదాపు గంట సేపు సాగాయి.