అండ్రాయిడ్ ప్లే స్టోర్‌ను షేక్ చేస్తున్న స్వదేశీ మెసేజింగ్ యాప్“అరట్టై”
అమరావతి: భారతీయు విదేశాలకు చెందిన పలు సోషల్ మీడియా వేదికైన ఆదారపడడం కంటే మనమే స్వంతంగా ఎందుకు ఇంత కంటే అద్బుతమైన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ ను డెవలెప్ చేసుకోకూడదు అంటు ప్రదాన మంత్రి నరేంద్రమోదీ ప్రస్తవించిన పాఠకులకు విదితమే.ఆత్మనిర్భర్ భారత్ లో బాగంగా స్వదేశీ మెసేజింగ్ యాప్ అయిన “అరట్టై” ఒక్క సారి వెలుగులోకి రావడమే కాదు,వాట్సప్ కు వణుకు పుట్టిస్తొంది. ప్రస్తుతం దేశ ప్రజలు స్వదేశీ నినాదానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు, “అరట్టై” మెసేజింగ్ యాప్ డౌన్ లోడ్స్ చూస్తే ఆర్దంమౌతొంది.
(Arattai Vs WhatsApp)అరట్టైకి– వాట్సాప్‌కు స్వరుప్యతులు:- అరట్టై, వాట్సాప్ కు మధ్య బెసిక్ ప్యూచర్స్ దాదాపు ఒకే లాగా ఉన్నాయి. టెక్స్ట్ మెసేజీలు,,మీడియా ఫైల్స్ షేరింగ్,, వాయిస్ నోట్స్,, వాయిస్,, వీడియో కాల్ ఫీచర్స్ వంటివన్నీ అరట్టైలో అందుబాటులోను ఉన్నాయి. వీటితో పాటు అరట్టై కొన్ని అదరపు ఫీచర్లను కూడా చేర్చింది. అరట్టైని ఆండ్రాయిడ్ టీవీల నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. వాట్సాప్‌లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ లాగానే అరట్టైలో కూడా స్టోరీస్, బ్రాడ్ కాస్ట్ తరహా ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి.
“పాకెట్”:- వాట్సాప్‌లో వ్యక్తిగత విషయాలు స్టోర్ చేసేందుకు యూ చాట్ అందుబాటులో ఉండగా అరట్టైలో ఇదే ఫీచర్‌ను “పాకెట్” పేరుతో అందుబాటులోకి వుంది. ఇందులో యూజర్లు తమ ఫొటోలు,, వీడియోలు,,నోట్స్ వంటివి స్టోర్ చేసుకునే అవకాశం కల్పించారు.
2G OR 3G నెట్వర్క్ లో కూడా ఈజీగా పనిచేసే విధంగా అరట్టైని లైట్ వెయిట్ యాప్‌గా డిజైన్ చేశారు. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ ఫోన్‌లల్లో కూడా ఇది ఎలాంటి బఫర్ లేకుండా పనిచేస్తుంది. వాట్సాప్‌తో పోలిస్తే అరట్టై గ్రామీణులకు మరింత సులభంగా సేవాలను అందిస్తుంది.
అరట్టై పూర్తిగా ఉచితం:- అరట్టై లోని యూజర్ల డేటాను టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ కోసం వినియోగించబోమని జోహో సంస్థ ప్రకటించింది.ఇదే సమయంలో యూజర్ల డేటా తమ వేదికలన్నిటికీ అనుసంధానమయ్యేలా వాట్స్ ప్ (మెటా) తన కొడింగ్ ను డిజైన్ చేసింది..అరట్టైలో గ్రూప్ చాట్స్ సులువుగానే వుంటుంది.ఒక గ్రూప్‌లో 1000 మందిని యాడ్ చేసుకునే వెసులు బాటు కల్పించారు..ఇదే సమయంలో వాట్సాప్‌లో ఈ లిమిట్ 1024గా ఉంది.
త్వరలో ఎండ్ టూ ఎండ్:- వాట్సాప్‌లో అన్ని రకాల సమాచార మార్పిడులకు ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ను వర్తింప చేస్తుంది. ప్రస్తుతానికి అరట్టైలో వాయిస్,, వీడియో కాల్స్ కు మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. టెక్స్ట్ మెసేజీలకు త్వరలో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను వర్తింప చేస్తామని ఇటీవలే అరట్టై మాతృసంస్థ జోహో ప్రకటించింది.