హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు-12 రోజుల్లో 51 మంది మృతి
అమరావతి: హిమాచల్‌ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి..రాష్ట్రంలోని ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగి పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి పోగా అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి..హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జూన్ 20 నుంచి జులై 2 వ తేదీ వరకూ రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఓ నివేదిక విడుదల చేసింది..సదరు నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రాణ,,ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది..ఆకస్మిక వరదలు,,కొండచరియలు విరిగిపడటం,, పిడుగులు పడటం వంటి వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 51 మంది మరణించారని తెలిపింది.. దాదాపు 22 మంది నీటి ప్రవహంలో గల్లంతు కాగా మండి జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించారని వెల్లడించింది.. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 103 మంది గాయపడ్డారు అని సదరు నివేదికలో పేర్కొంది.
భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.. చండీగఢ్-మనాలీ హైవేలోని మండి-మనాలీ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలను మూసివేశారు..అలాగే మండి,,సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 300కి పైగా రహదారులను అధికారులు మూసివేశారు..వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేస్తూ అదివారం,,సోమవారం భారీ వర్షాలకు అవకాశం వుందని హెచ్చరించింది.