ఆంధ్రప్రదేశ్,ఒడిశా,పంజాబ్ ల్లో నాలుగు సెమీకండక్టర్ల ప్రాజెక్టులు-మంత్రి వైష్ణవ్
అమరావతి: దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడంలో బాగంగా నాలుగు కొత్త ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నాలుగు కొత్త ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది..ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామని,,ఈ ప్రాజెక్టుల కోసం రూ.4,594 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు..గతం సంవత్సరం ప్రభుత్వం 6 సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించిందని,, ప్రస్తుతం అమోదం తెలిపిన మరో నాలుగు ప్రాజెక్టులతో కలసి ఈ సంఖ్య 10కి చేరుకుందని అన్నారు.. చిప్ తయారీ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించే దిశలో ప్రధాని మోదీ నాయకత్వం పనిచేస్తొందని తెలిపారు.. సెమీకండక్టర్ రంగంలో ఈ పెట్టుబడులను,,సాంకేతిక సామర్థ్యాలను పెంచడమే కాకుండా డిజిటల్ ఇండియా దార్శనికతను కూడా బలోపేతం చేస్తుందన్నారు.. ఈ ప్రాజెక్టుల కింద ఆధునిక సెమీకండక్టర్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు..
ఆంధ్రప్రదేశ్లో 96 మిలియన్ యూనిట్లు ఉత్సత్తి:- ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ యూనిట్-అడ్వాన్స్ డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ASIP) ₹468 కోట్లు పెట్టుబడితో సంవత్సరానికి 96 మిలియన్ యూనిట్లు ఉత్సత్తి సామర్థ్యం ఈ ప్లాంట్ కు వుంటుందన్నారు.
సెమీకండక్టర్ ప్లాంట్లు స్థానిక:- ఎలక్ట్రానిక్స్,,ఆటోమొబైల్,,రక్షణ వంటి రంగాలలో దేశం విదేశీ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.. అలాగే ఈ ప్రాజెక్టులు స్థానికంగా యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని,, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు..ఆంధ్రప్రదేశ్,,ఒడిశా,,పంజాబ్లలో ఏర్పాటు చేయబోయే ఈ సెమీకండక్టర్ ప్లాంట్లు స్థానిక పరిశ్రమలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా సాంకేతిక సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.. ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలను విస్తరిస్తరణ,, ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు..