ఖాలీదా జియా అంత్యక్రియలకు హాజరైన విదేశంగా మంత్రి జైశంకర్
నెల్లూరు: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం ఢాకాకు వెళ్లారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలేదా జియా అంత్యక్రియలకు హాజరై భారత తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ఢాకా చేరిన వెంటనే జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్‌ను జైశంకర్ కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత లేఖను ఆయనకు అందజేశారు. భారత ప్రభుత్వం, భారత ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేశాను” అని అయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
జియా మృతిపై మోదీ సంతాపం:- జియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా జియా ఆ దేశ అభివృద్ధి, భారత్-బంగ్లాదేశ్ సంబంధాల బలోపేతంలో చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ అన్నారు.

