DISTRICTSNATIONAL

తీవ్రవాదం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయం-కలెక్టర్

తిరుపతి: భారత ప్రభుత్వం, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి ద్వారా నిర్వహిస్తున్న నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ (National Children’s Fund – NCF) ఆధ్వర్యంలో ఉగ్రవాద హింస, వామపక్ష తీవ్రవాదం (Left Wing Extremism – LWE) తిరుగుబాటు లేదా సరిహద్దు కాల్పులు (Cross-Border Firing) కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన లేదా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న పిల్లలకు కేర్ అండ్ ఎడ్యుకేషన్ (Care and Education)” అంశం కింద ఆర్థిక సహాయం అందించబడుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్-మేజిస్ట్రేట్ వెంకటేశ్వరన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వరకు వారి విద్యకు సంబంధించిన మౌలిక అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు. ఈ సహాయంతో బాధిత పిల్లలు నిరంతర విద్యను కొనసాగిస్తూ, సురక్షిత వాతావరణంలో తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం పొందుతారని పేర్కొన్నారు. పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాల ప్రకారం పిల్లల వివరాలను పరిశీలించి, నిబంధనల మేరకు సహాయం మంజూరు చేయబడుతుందని పేర్కొన్నారు.ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా మహిళా-శిశు సంక్షేమశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు.

అర్హులైన పిల్లలు ఈ పథక ప్రయోజనాలు పొందేందుకు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయము, రూమ్ నెం. 519, బి-బ్లాక్, ఐదవ అంతస్తు, కలెక్టరేట్, తిరుపతి, కార్యాలయం పని వేళలు:ఉదయం:- 10.30 AM నుండి సాయత్రం:-5.30 PM వరకు సంప్రదించవచ్చని లేదా ఇతర సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. వి. శివశంకర్  సంప్రదించవచ్చని తెలియజేశారు. ఫోన్ నంబర్: 8919168751

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *