అవినితి అధికారుల ఆస్తుల కేసులో చార్జీ షీట్ వేయండి-సుప్రీంకోర్టు
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల (అవినీతి) కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన 13 FIRలను రద్దు చేస్తూ ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ACB రాయలసీమ జాయింట్ డైరెక్టర్ దాఖలు చేసిన అప్పీళ్లను న్యాయమూర్తులు ఎం.ఎం. సుందరేష్ & సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర విభజన తరువాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా అధికారికంగా నోటిఫై చేయలేదన్న టెక్నికల్ కారణంతో హైకోర్టు కేసుల FIRలను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసులో హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.

