రైతులు 48 గంటల్లోగా పంట కోత పూర్తి చేసి,పొలాలను ఖాళీ చేయాండి-BSF
పంటల్లో విద్రోహులు దాక్కుని దాడి చేసే…
అమరావతి: మంగళవారం 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి(జీరో లైన్) ఉన్న రైతులు 48 గంటల్లోగా పంట కోత పూర్తి చేసి, తమ పొలాలను ఖాళీ చేయాలని సరిహద్దు భద్రతా దళం (BSF) శనివారం అత్యవసరంగా ఆదేశాలు జారీ చేసింది..వేలాది మంది పంజాబ్ రైతులు జీరో లైన్ వెంబడి సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో తమ పొలాల్లో సేద్యం చేస్తున్నారు..ప్రస్తుతం వారు పండించిన పంటలు ఇప్పుడు చాలా వరకూ చేతికందాయి.. దీంతో వెంటనే పంటను కోసి ఇళ్లకు తెచ్చుకోవాలని, లేదంటే..ఏపుగా పెరిగి పంటల్లో విద్రోహులు దాక్కుని దాడి చేసే ప్రమాదముందని సదరు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో బీఎస్ఎఫ్ దళం వివరణ ఇచ్చింది..ఇండియా-పాకిస్తాన్ మధ్య 530 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉంది..జీరో లైన్ వెంట దాదాపు 45,000 ఎకరాల భూమిని మన రైతులు సాగు చేస్తున్నారు.. అమృత్‌సర్‌లోని రౌడా వాలా ఖుర్ద్ లోని స్థానిక గురుద్వారా,,తర్న్ తరణ్, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లోని గ్రామాలలో ఉన్న గురుద్వారాలు కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తూ,,రైతులు వీలైనంత త్వరగా పంటలు కోయాలని సూచించాయి..ఎందుకంటే యాక్సెస్ గేట్లు త్వరలో మూసివేయబడతాయని ఆయా గురుద్వారాలు సరిహద్దు ప్రాంత రైతులను అప్రమత్తం చేస్తున్నాయి.

