యూఎస్ఏలో కూలిపోయిన F-35 ఫైటర్ జెట్
అమరావతి: వ్యాపారం కోసం ఎలాంటి నీచమైన రాజకీయలు అయిన నెరిపే అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో ఒక గొప్ప విమానం అని చెప్పుకునే F-35 విమానం కుప్పకూలిపోయింది..బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో సెంట్రల్ కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ లెమూర్ వద్ద F-35 ఫైటర్ జెట్ కూలిపోయినట్లు US NAVY అధికారులు ధృవీకరించారు..ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డడని,,ఎలాంటి గాయాలూ కాలేదని పేర్కొన్నారు.. ఫైటర్ జెట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఇందుకు సంబంధించిన దృష్యాలు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి..ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు US NAVY తెలిపింది..
సోకాల్డ్ F-35 ఫైటర్ జెట్:- ఎఫ్-35 ఫైటర్ జెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటని దినికి తిరుగులేదంటూ డప్పాలు కోట్టుకుంటున్న అమెరికాకు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావడం లేదు.. USA రక్షణ అయుధాల తయారీ సంస్థ అయిన లాక్‌హీడ్ మార్టిన్ F-35 ఫైటర్ జెట్ ను అభివృద్ధి చేసింది..ఇది 5 జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పుకుంటారు.. దీని ధర సుమారు 115 మిలియన్ డాలర్లుగా ఉంటుంది..ఈ ఫైటర్ జెట్ షార్ట్ టేకాఫ్‌తో పాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది.. బ్రిటన్ దేశం వద్ద వున్నఈ సోకాల్డ్ F-35 ఫైటర్ జెట్ విమానం ఇటీవలే కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ లో సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు 40 రోజులు నిలిచి పోయింది.

