అమెరికాతో వాణిజ్య ఒప్పదం వాయిదా వేస్తున్నాం-యూరోపియన్ యూనియన్
అమరావతి: ప్రపంచంలో ఏ దేశమైన తాము చెప్పిన మాట వినాల్సిందే లేదంటే టారిఫ్ లు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరో రెచ్చిపోతున్నారు. యూరప్ పై టారిప్ యుద్దం ప్రకటించారు. టారిప్ బెదిరింపుల నేపధ్యం….గ్రీన్ ల్యాండ్‌ను ఆక్రమించుకొవాలన్ని పంతంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,, గ్రీన్లాండ్ విషయంలో తమకు సమర్థించని యూరప్ దేశాలపై 10 శాతం సుంకం విధిస్తామని చేసిన చేసిన హెచ్చరికలతో యూరోపియన్ యూనియన్ (EU) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జూలైలో ప్రకటించిన యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూరోపియన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు సిగ్ఫ్రిడ్ మురెసాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“గత సంవత్సరం జూలైలో కుదిరిన యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే రాటిఫై చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి ఈయూకు వచ్చే దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించే అవకాశం ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాల్సి వస్తుంది” అని సిగ్ఫ్రిడ్ మురెసాన్ తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ద్వారా ఈయూకి చేకూరే ఏకైక లాభం స్థిరత్వం మాత్రమేనని,, కానీ అమెదరికా అధ్యక్షడు ప్రకటతో ఆ స్థిరత్వం దెబ్బతిన్నదని వెల్లడించారు. అందుకే ఈ వాణిజ్య ఒప్పంద రాటిఫికేషన్ను వాయిదా వేయడం సమంజసంగా భావిస్తున్నమని స్పష్టం చేశారు.
కొస మెరుపు:- త్వరలోనే యూరోపియన్ యూనియన్,భారతదేశంతో వాణిజ్య ఒప్పదం చేసుకొనున్నది.

