భారత్‌లో తొలి షోరూంను జులై 15న ముంబైలో ప్రారంభిస్తున్న ఎలన్ మాస్క్
అమరావతి: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది..జులై 15న టెస్లా భారత్‌లో తొలి షోరూంను అఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రారంభించనున్నట్లు సమాచారం..భారతదేశ మార్కెట్ లో ప్రవేశ పెట్టేందుకు టెస్లా సంస్థ Y మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలోని వారి ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం..ఇండియన్ మార్కెట్ లో టెస్లా కారుకు వచ్చే డిమాండ్‌ను చూసిన తరువాత ఢిల్లీలో మరో షో రూం ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి..బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకుంది..పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారని సమాచారం..ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన Y మోడల్ కారు ధర పన్నులు, బీమా కలిపితే దాదాపు రూ.48 లక్షల వరకు వుండవచ్చు.? యూరప్, చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగ పడిపోవడంతో,,ప్రస్తుతం భారతదేశం మార్కెట్ మత్రమే ఎలన్ మాస్క్ కు దిక్కు అయింది.