ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్ నుంచి తొలగించి ఎన్నికల సంఘం
అమరావతి: దేశవ్యాప్తంగా 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీలను ఎన్నికల రిజిస్టర్ నుంచి ఎన్నికల సంఘం తొలగించింది..2019 నుంచి 6 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని ఎన్నికల సంఘం తెలిపింది..ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యే సమయంలో ముఖ్యమైన ఈ షరతును నెరవేర్చడంలో ఈ రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయని తెలిపింది.. రిజిస్టర్ అయిన 334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు శనివారం పేర్కొంది..గుర్తింపు లేని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు,, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవని ఎన్నికల సంఘం తెలిపింది.. అయితే జాబితా నుంచి తొలగించిన ఈ పార్టీల కార్యాలయాలు భౌతికంగా కూడా ఎక్కడా లేవని వెల్లడించింది.. మొత్తం 2,854 నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో 334 పార్టీల తొలగింపు తర్వాత 2,520 రాజకీయ పార్టీలు రిజిస్టర్ జాబితాలో ఉన్నట్లు ఈసీ పేర్కొంది.. ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు,, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని వెల్లడించింది.