37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీఐ
అమరావతి: ఎలెక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా(ECI) రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఏప్రిల్ లో చివరి నాటికి 37 మంది రాజ్యసభ సభ్యుల గడవు ముగియనున్నది.ఈ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల (MLAs) ఓట్ల ద్వారా జరుగుతాయి.
నోటిఫికేషన్ విడుదల:– ఫిబ్రవరి 26, 2026…నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ:-మార్చి 5, 2026…నామినేషన్ల పరిశీలన:-మార్చి 6, 2026…నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ:-మార్చి 9, 2026…పోలింగ్:-మార్చి 16, 2026 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)…ఓట్ల లెక్కింపు:-మార్చి 16, 2026 సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది.వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
ఖాళీ అయ్యే రాష్ట్రాలు:-మహారాష్ట్ర:-7 స్థానాలు…తమిళనాడు:-6 స్థానాలు…పశ్చిమ బెంగాల్: 5 స్థానాలు…బిహార్:- 5 స్థానాలు…అస్సాం:- 3 స్థానాలు…ఒడిశా:-4 స్థానాలు…ఛత్తీస్‌గఢ్:-2 స్థానాలు…తెలంగాణ:-2 స్థానాలు…హర్యానా: 2 స్థానం…హిమాచల్ ప్రదేశ్ లో 1 స్థానంకు వుంది.

