65 లక్షల మంది ఓటర్ల జాబితాను వెల్లడించిన ఈసీ
అమరావతి: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (SIR)భాగంగా తొలగించిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బీహార్ రాష్ట్రంలో భారీగా ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షలు ఆధారలు లేని విమర్శలు చేస్తున్నాయి. విపక్షాలు కొన్నిరోజులుగా తొలగించిన ఓటర్ల పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఈసీ తాజాగా 65 లక్షల మంది పేర్లను వెలువరించింది.ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్ లో ఓటర్లు తమ పేర్లను పరిశీలించేందుకు వీలుగా లింక్ ను వుంచింది.