”ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలను నమ్మొద్దు”-ఐఏఎఫ్
అమరావతి: ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆదివారం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది..ఈ ఆపరేషన్‌లో భాగంగా తమకు అప్పగించిన విధులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది..అత్యంత కచ్చితత్వం,, వృత్తి నైపుణ్యంతో పనులు పూర్తి చేశామని,,ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలను నమ్మొద్దని సూచించింది..”ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది…మాకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశాం.. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా సైనిక చర్యలు కొనసాగుతున్నందన సమయానుకూలంగా వివరాలు వెల్లడిస్తాం… అధికారికంగా వెల్లడించే వరకు వదంతులు వ్యాప్తి చేయవద్దని,, ధృవీకరణ లేని వార్తలను నమ్మొద్దని కోరుతున్నాం” అంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది.
https://x.com/IAF_MCC/status/1921460735575507121