NATIONALOTHERSWORLD

ఇరాన్ పై దాడులతో అనుకున్న లక్ష్యాలను సాధించాం-త్వరలోనే ముగుస్తుంది-డొనాల్డ్ ట్రంప్

అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్ తో కలసి ఇరాన్‌ పై మొదలు పెట్టిన యుద్ధం 35 రోజులు దాటింది.యుద్దం మొదలు అయిన తరువాత అమెరికా- ఇజ్రాయిల్ దాడులకు ఇరాన్‌ ప్రతి దాడులతో ఢీ అంటే ఢీ అంటుంది.ఇదే సమయంలో అమెరికాకు యుద్ధం ఖర్చులు తడిపి మోపిడి కావడం,దేశంలో పెట్రోల్ రేట్లు,ఇతర వస్తువుల ధరలు పెరగడంతో అమెరికన్‌ పౌరులు సైతం ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇరాన్‌ యుద్ధంపై ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక అధ్యక్షడు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో డోనాల్డ్‌ ట్రంప్ వైట్‌హౌస్‌లో జాతినుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ముఖ్య నేతలను అంతమొందించాం. మరో మూడు వారాల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పారు.

హర్మూజ్ జల సంధి నుంచి తమకు ఎలాంటి చమురు అక్కర్లేదని స్పష్టం చేశారు. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ కోసం మాత్రమే వినియోగించుకోవాలి అని సూచించారు. సంక్షోభం ముగిశాక హర్మూజ్ జల సంధి తెరుచుకుంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధ దేశంగా మారనివ్వమని తెలిపారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తూ, ఇరాన్‌ 45 వేల మందికి మృతికి కారణమైందన్నారు. ఇరాన్ నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్‌ ను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. ఇరాన్‌ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నదని డొనాల్డ్ ట్రంప్, గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *