NATIONALOTHERSTECHNOLOGY

బ్రహ్మోస్‌ మిసైల్ కంటే వేగంగా దాడులు చేసే “ధ్వని క్షిపణి”

అమరావతి: భారతదేశంపై మూడు వైపుల(చైనా,పాకిస్తాన్,బంగ్లాదేశ్) నుంచి ముప్పు పొంచి వున్న నేపధ్యంలో ప్రధాని మోదీ మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్టంగా మర్చేందుకు వేగాంగా చర్యలు తీసుకుంటున్నారు..అధునాతన శత్రువులపై భీకరమైన దాడులు చేసే మిసైల్స్,,యాంటీ ఎయిర్ మిసైల్ వ్యవస్థలు,, ఫైటర్‌ జెట్‌లు,, డ్రోన్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఈ నేపధ్యంలో హైపర్‌సోనిక్‌ క్షిపణి (Hypersonic Missile) ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ వెహికల్‌ (HGV) ‘ధ్వని (Dhvani)’ పరీక్షలను ఈ సంవత్సరం చివరికి (2025) పూర్తి చేయాలని DRDO గట్టి సంకల్సంతో ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్‌ సిందూర్‌లో దడ పుట్టించిన బ్రహ్మోస్‌ (BrahMos) కంటే హైపర్‌సోనిక్‌ మిసైల్ భీకరంగా లక్ష్యలను చేధిచేస్తాయని అంచనా వేస్తున్నారు.

గంటకు 7 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో:- అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం HGVల సొంతం. శబ్దవేగానికి ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణులు ప్రయాణించగలవు. డీఆర్‌డీఓ సిద్ధం చేస్తోన్న Mach 5 (over 7,400 kmph) HGVని గంటకు 7 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 6000 నుంచి 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని అంచనా వేస్తున్నారు. వేగంతోపాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా వుండదని రక్షణ రంగ నిపుణులు అంచన వేస్తున్నారు. దిన్ని (ఇజ్రాయిల్) ఐరన్ డోమ్ లేదా (అమెరికా) THAAD వంటి ప్రస్తుత రక్షణ వ్యవస్థలు కూడా ఆపడం లేవు.

ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు:- హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్‌ వెహికల్‌ ఉంటుంది. రాకెట్‌ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి,, అక్కడ నుంచి విడిపోయి హైపర్‌సోనిక్‌ వేగంతో లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ HGV పరీక్షలను DRDO ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎయిర్‌ఫ్రేమ్‌ ఏరోడైనమిక్స్‌,, థర్మల్‌ మేనేజ్‌మెంట్‌,, స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ పనితీరు,, గైడెన్స్‌ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి,, వైమానిక పరీక్షలు చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *