CRIMENATIONAL

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై ఫిర్యాదుదారుడిలా వచ్చిన వ్యక్తి దాడి

అమరావతి: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై ఫిర్యాదుదారుడిలా వచ్చిన ఒక వ్యక్తి దాడి చేశాడు..బుధవారం సీఎం రేఖాగుప్తా జన్‌ సున్‌వాయ్‌ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటలకు నిర్వహిస్తూన్న సందర్బంలో ఈ ఘటన చోటు చేసుకుంది..దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని,,పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.. అతడి పేరు రాజేష్ సకారియ(41)గా గుర్తించారు..గుజరాత్‌లోని రాజ్‌కోట్ అతడ స్వస్థలమని పోలీసులు పేర్కొన్నారు..

తీవ్ర షాక్‌కు గురి అయిన సీ.ఎం:- తనపై ఉహించని విధంగా దాడి జరగడంతో సీ.ఎం షాక్ కు గురి అయ్యారు..దింతో సిబ్బంది, ఆమెను ఆసుపత్రికి తరలించారు..దాడిని బీజపీ సీనియర్ నేత హరీష్ ఖురానీ తీవ్రంగా ఖండించారు..సీఎం రేఖా గుప్తాకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు..ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని,,సంఘటనపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జన్‌ సున్‌వాయ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా వద్దకు కాగితాలు పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడని చెప్పారు..తన సమస్యను ఆమె వివరిస్తూ, ఒక్కసారిగా ఆమెను గ‌ట్టిగా రెండు సార్లు చెంప‌పై కొట్టిన‌ట్లు తెలుస్తోంది.. జుట్టు ప‌ట్టుకుని మ‌రీ కొట్టిన‌ట్లు చెబుతున్నారు..జుట్టు ప‌ట్టి పీక‌డంతో, త‌ల‌కు గాయాలైన‌ట్లు తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *