CRIMENATIONAL

కరుడు కట్టిన సిగ్మా గ్యాంగ్‌లోని నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను ఎన్‌కౌంటర్ చేసిన దిల్లీ, బిహార్ పోలీసులు

అమరావతి: ఢిల్లీలోని రోహిణిలో గురువారం వేకువజామున జరిగిన ఒక పెద్ద ఆపరేషన్, ఢిల్లీ-బీహార్ పోలీసుల బృందాలు సంయుక్తంగా నలుగురు మోస్ట్ వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్లను ఎన్ కౌంటర్ చేసింది..ఈ నలుగురు నేరస్థులు బీహార్‌లో జరిగిన అనేక హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరస్థులు చాలా రోజులుగా ఢిల్లీలో దాక్కున్నట్లు సమాచారం.

మాఫియా నెట్‌వర్క్‌:- ఈ నలుగురు నేరస్థులు బీహార్‌లో జరిగిన అనేక హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరస్థులు చాలా రోజులుగా ఢిల్లీలో దాక్కున్నట్లు సమాచారం. హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్లను రంజన్ పాఠక్(25),,బిమ్లేష్ మహతో(25),,మనీష్ పాఠక్(33),, అమన్ ఠాకూర్‌(21)గా గుర్తించారు. హతమైన గ్యాంగ్‌స్టర్లు ‘సిగ్మా గ్యాంగ్’లో భాగమని సమాచారం. రాజన్ పాఠక్ ఈ గ్యాంగ్‌కు ప్రధాన సూత్రధారి. అతను బీహార్-పరిసర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌ ను నిర్వహించేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు:- ఎన్నికల సందర్భంగా బిహార్‌లో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు సిగ్మా గ్యాంగ్‌ సభ్యులు కుట్రపన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బిహార్,, దిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ సంయుక్త టీమ్‌ను ఏర్పాటు చేసి సిగ్మా గ్యాంగ్‌ సభ్యుల జాడకు సంబంధించి సమాచారం అందుకున్నారు.పోలీసులు చుట్టుముట్టగానే నలుగురు గ్యాంగ్‌స్టర్‌లు కాల్పులకు తెగబడడంతో, పోలీసులూ ప్రతి కాల్పులు జరిపారు.15 నిమిషాల పాటు ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. నలుగురు గ్యాంగ్‌స్టర్లకు బుల్లెట్లతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రోహిణి ఏరియాలోని డాక్టర్ BNA హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే అప్పటికే ఆ నలుగురు చనిపోయారని వైద్యులు చెప్పారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. గ్యాంగ్‌స్టర్ల కాల్పుల్లో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు గ్యాంగ్‌స్టర్లు పలు హత్యలు, ఆయుధాలతో బెదిరించి లూటీలకు పాల్పడిన కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారని దిల్లీ క్రైం బ్రాంచ్ డీసీపీ సంజీవ్ యాదవ్ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *