ధర్మశాలలో ఘనంగా దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు
అమరావతి: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు, హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలోని సుగ్లాగ్‌ఖాంగ్ దేవాలయంలో ఘనంగా జరిగాయి..ఈ వేడుకలకు కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్‌తోపాటు బౌద్ధ సన్యాసులు, భక్తులు హాజరయ్యారు.. విదేశాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఇందులో పాల్గొన్నారు.. భారత్, టిబెట్ జాతీయ గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంలో మాట్లాడిన దలైలామా మానవతా విలువలు, మత శాంతి ప్రచారం చేయడానికి తాను కట్టుబడి ఉంటానని సందేశం ఇచ్చారు.. టిబెట్ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్రశాంతత, కరుణను అందిస్తుందన్నారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ:- 14వ దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రేమ, కరుణ, సహనానికి దలైలామా శాశ్వత చిహ్నమని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రశంసించారు.. దలైలామాకు పుట్టినరోజు తెలిపేందుకు 140 కోట్ల భారతీయులతో తాను కలిసినట్లు చెప్పారు.