అటల్ జీ సంకల్పంతోనే దేశంలో స్వర్ణ చతర్భుజి రోడ్ల నిర్మాణం ప్రారంభం అయింది-ప్రధాని మోదీ
రాష్ట్రీయ ప్రేరణస్థల్..
అమరావతి: స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన దేశ మహనీయులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని,,స్వాతంత్ర్యం తరువాత దేశంలో చేపట్టిన మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించారని అంటూ కాంగ్రెస్ అనుసరించిన విధానాలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో “రాష్ట్రీయ ప్రేరణస్థల్”ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
మహనీయుల విగ్రహాలు స్ఫూర్తి నింపుతాయి:- డా,శ్యామాప్రసాద్, దీన్‌దయాల్, వాజ్‌పేయీ విగ్రహాలు గొప్ప స్ఫూర్తి నింపుతాయన్నారు. డిసెంబర్ 25వ తేదిన ఇద్దరు మహనీయులు జన్మించారని,,వాజ్‌పేయీ, మదన్‌మోహన్ మాలవీయ భారత ఏకత్వానికి కృషి చేశారని తెలిపారు. ప్రేరణస్థల్ ప్రజల ప్రతి అడుగు జాతి నిర్మాణం దిశగా ఉండాలనే సందేశం ఇస్తుందని వెల్లడించారు. ప్రజలందరి కృషితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుందన్నారు.మహనీయుల విగ్రహాలు ఎంత ఎత్తు ఉన్నాయో వాటి వల్ల కలిగే ప్రేరణ అంత కంటే గొప్పదని,, శ్యామాప్రసాద్, దీన్‌దయాల్ కలల సాకారాం చేసుందుకు సంకల్పం తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో 8 లక్షల కి.మీ మేర:- అటల్‌జీ హయాంలోనే గ్రామగ్రామాన రోడ్ల నిర్మాణానికి బీజం పడిందన్నారు.2000 సంవత్సరం నుంచి అటల్ జీ చేపట్టిన గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో 8 లక్షల కి.మీ మేర రోడ్ల నిర్మాణం జరిగాయని గుర్తు చేశారు. గత 11 సంవత్సరాల్లోనే దాదాపు 4 లక్షల కి.మీ మేర గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం మరింత వేగం పుంజుకుందని, అటల్‌జీ హయాంలోనే దిల్లీలో మెట్రో ప్రారంభమైందని చెప్పారు.
65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలు:- భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి (డిసెంబర్ 25) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్ ను జాతికి అంకితం చేశారు. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ జాతీయ స్మారక సముదాయంలో అటల్ బిహారీ వాజ్‌పేయీతో పాటు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయల ఆదర్శాలకు అనుగుణంగా వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ సముదాయంలో ముఖ్య ఆకర్షణగా ముగ్గురు నాయకుల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీటిని చుట్టుపక్కల నీటితో కూడిన ప్లాట్‌ఫాం మీద ఏర్పాటు చేశారు. వీటికి తోడు, కమలాకారంలో రూపొందిన అత్యాధునిక మ్యూజియం (సుమారు 98,000 చదరపు అడుగులు) ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో అడ్వాన్స్ డ్ డిజిటల్, ఇమ్మర్సివ్ టెక్నాలజీల ద్వారా భారత జాతీయ ప్రయాణం, నాయకత్వ వారసత్వాన్ని ప్రదర్శిస్తారు.

