కాంగ్రెస్ పార్టీ మహిళ ఎంపీల దిగజూరుడు ప్రవర్తన-మంత్రి రిజిజు
అమరావతి: లోక్‌సభలో ఫిబ్రవరి 4వ తేదీన ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్ద విపక్ష మహిళా ఎంపీలు ఆందోళన చేపట్టిన విషయం విదితమే. సదరు సంఘటనకు సంబంధించి వీడియోను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు నేడు ఆ రోజు జరిగిన సంఘటనకు చెందిన వీడియోను తన సోషట్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. విపక్ష మహిళా సభ్యులు బ్యానర్లు పట్టుకుని.. మోదీ కూర్చుకునే సీటు వద్ద నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ఆ సమయంలో ప్రధాని మోదీ అక్కడకు రావాల్సి ఉన్నది. కానీ విపక్ష మహిళా ఎంపీల (దాడులకు దిగేందుకు) నిరసన కారణంగా ప్రధాని రాలేకపోయారు. ఆ తరువాత ప్రధాని ప్రసంగం చేయకుండానే తీర్మానాన్ని ఆమోదించినట్లు లోక్‌సభ ప్రకటించింది.
పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ఆ రోజు జరిగిన సంఘటనకు చెందిన వీడియోను తన సోషట్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి నేతృత్వంలో కొందరు మహిళా ఎంపీలు ప్రధాని మోదీ సీటు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో నిలుచుని నినాదాలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల దిగజారుడు ప్రవర్తన పట్ల గర్వంగా ఫీలవుతుందని” మంత్రి రిజిజు తన ట్వీట్‌లో ఆరోపించారు. తమ పార్టీ హుందాగా వ్యవహరించి, పార్లమెంట్ గౌరవాన్ని, పవిత్రతను కాపాడినట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రధానిని అడ్డుకున్న మహిళా విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌ను కోరుతూ లేఖ రాశారు.
https://x.com/KirenRijiju/status/2021082523649073377/video/1

