NATIONALPOLITICS

అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయడమే కాంగ్రెపార్టీ ధ్యేయం!

కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటు-అమిత్ మాలవీయ

కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు శయశక్తుల ప్రయత్నిస్తునే వుంటుంది. ప్రపంచ దేశాలు అబ్బురపడేలే,భారతదేశం అత్యంత అధ్బుతంగా నిర్వహిస్తున్న ఆర్టిఫియల్ ఇంజెల్ జెన్స్ సమ్మిట్-2026, గౌరవంను ప్రపంచ దేశాల ముందు దిగజార్చే విధంగా ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ యువరాజు,తన పార్టీకి సంబంధిచి (వీధి…..) యువజన నాయకులు అని చెప్పుకుంటున వారిని దేశం పరువు తీసేందుకు ఉసిగొల్పునట్లు వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి!….జరిగిన నీచమైన సంఘటన….భవ ప్రకటన స్పేచ్చకు కూడా ఒక హద్దు వుంటుంది అన్న న్యాయస్థానల వ్యాఖ్యనాలు ఇక్కడ మననం చేసుకోవాల్సి అవసరం ఏర్పడుతొంది…???

అమరావతి: శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో నీచమైన సంఘటన చోటుచేసుకుంది. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు (అని చెపుకునే వాళ్లు) చొక్కాలు విప్పి వీరంగం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐ సమ్మిట్ జరుగుతున్న ఒక హాలులో ఈ ఘటన చోటుచేసుకుందని, కొందరు గుంపుగా వేదిక వద్దకు చేరి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు,వీడియోలు స్పష్టం చేశాయి.

ఈ సంఘటనకు సంబంధించి పలువురిని నిర్బంధంలోకి తీసుకున్నామని, భారత్ మండపంలోకి ఈ గ్రూప్ ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు పాస్‌తో లోపలకు ప్రవేశించారా, క్యూఆర్ కోడ్‌తో లోపలకు వచ్చారా అనే విషయంపై విచారణ జరుగుతున్నాట్లు తెలుస్తొంది. ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దేశ ప్రతిష్టను దెబ్బతీయడం:- ఈ సంఘటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటని, చేసిన పనికి కాంగ్రెస్ సిగ్గుపడాలని అన్నారు.’ఇది నేషనల్ షేమ్.టెక్నాలజీలో నాయకత్వం, ఇన్నొవేషన్‌కు పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు భారత్ అతిథ్యం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది’ అని అమిత్ మాలవీయ తీవ్రంగా మండిపడ్డారు. గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా నిలిచేందుకు భారత్ కృషి చేస్తుంటే ఇలాంటి దుశ్చర్యలు దేశప్రయోజనాలకు భంగకరమని అన్నారు. రాజకీయంగా విభేదించడం ప్రజాస్వామిక హక్కు అని, అయితే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయడం తగదని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *