లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం తీర్మానం నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు
అమరావతి: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్,విపక్ష ఎంపీలు కలసి మంగళవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. అవిశ్వాసం నోటీసులపై 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్,,డీఎంకే, ఎస్పీ ఎంపీలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అవిశ్వాసం నోటీసులపై సంతకాలు చేసేందుకు ఒప్పుకోలేదు. సభలో తాము మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించడం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. భారత్-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు సభలో గందరగోళం సృష్టించడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీరుపై ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంకు నోటీసులు ఇచ్చింది.

