జమ్ముకశ్మీర్,, హిమాచల్ ప్రదేశ్ లో విధ్వంసం సృష్టించిన క్లౌడ్‌బరస్ట్-33 మంది మృతి
అమరావతి: క్లౌడ్‌బరస్ట్ కారణంగా జమ్ముకశ్మీర్,, హిమాచల్ ప్రదేశ్ లో మెరుపు వరదలు విధ్వంసం సృష్టించాయి..జమ్ముకశ్మీర్ కిష్ట్వార్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి.. భారీ వరదల కారణంగా జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 33మంది మరణించారు..మచైల్ మాతా ఆలయానికి వెళ్లే దారిలో ఈ దుర్ఘటన జరిగింది.. NDRF,,SDRF బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి..
2.800 మీటర్ల ఎత్తులో:- మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 2.800 మీటర్ల ఎత్తులో ఉంది.. జూలై 25న ఈ యాత్ర మొదలైంది.. జమ్ము డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు..సెప్టెంబర్ 5న ఈ యాత్ర ముగియనుంది.. మెరుపు వరదల ప్రమాదంలో 220 మంది యాత్రికులు గల్లంతూ అయినట్లు సమాచారం..120 మంది గాయపడ్డారు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి..సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని,,ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి..సహాయక చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు..ప్రస్తుతం యాత్రను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కిష్త్వార్ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు..ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు..సహాయక చర్యలను వేగవంతం చేయాలని అదేశించారు..
హిమాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది.. క్లౌడ్‌బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి..వంతెనలు కొట్టుకుపోగా,,రోడ్లు ధ్వంసమయ్యాయి..రాష్ట్రంలో రెండు జాతీయ రహదారులతో సహా 325 రోడ్లను అధికారులు మూసివేశారు.. ఆకస్మిక వరదలు కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు..కార్పట్ గ్రామానికి ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు..