భారత్ సరిహద్దులకు దగ్గరలో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా
అమరావతి: భారతదేశంతో ఒక ప్రక్క వాణిజ్యం అంటూనే నక్క జిత్తుల డ్రాగన్ కంత్రీ….భారత్,,చైనాల మధ్యం 2020లో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రదేశాలలో ఒకదాని నుంచి దాదాపు 110 కి.మీ దూరంలో, టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా వేగంగా నిర్మాణాలు చేస్తొంది. ఇటీవలి శాటిలైట్స్ చిత్రాలు చైనా కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు చూపిస్తున్నాయి.. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యారక్‌లు, వాహన షెడ్‌లు, రాడార్ సైట్‌లు అలాగే మందుగుండు సామగ్రిని నిల్వ చేసే అండర్ గ్రౌండ్ బంకర్స్ లు ఉన్నాయి.
మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్:- ఈ కొత్త స్థావరంలో అత్యంత ముఖ్యమైన భాగం ట్రాన్స్ పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ వాహనాల కోసం “స్లైడింగ్ రూఫ్”లను కలిగి ఉన్నట్లు కనిపించే కవర్ చేయబడిన మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ గా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ లాంచింగ్ ప్యాడ్స్ నుంచి మిసైల్ ను ప్రయోగించేందుకు వీలుగా నిర్మాణలు జరుగుతున్నాయి. ఈ మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ నుంచి చైనా సిద్దం చేసుకున్న లాంగ్ రేంజ్ HQ 9 ఉపరితలం నుంచి గగనతల క్షిపణి వ్యవస్థలను దాచిపెట్టడానికి అదే సమయంలో ఉపయోగించడానికి అనువుగా వున్నట్లు నిఘ వర్గాలు అంచన వేస్తున్నాయి.
నియోమా ఎయిర్‌ఫీల్డ్:- అమెరికాకు చెందిన జియో-ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్‌సోర్స్ అనాలిసిస్ పరిశోధకులు ఈ డిజైన్‌ను మొదట గుర్తించారు. భారతదేశం అప్‌గ్రేడ్ చేసిన “నియోమా ఎయిర్‌ఫీల్డ్” కు ఎదురుగా, వాస్తవ నియంత్రణ రేఖ నుంచి 65 కి.మీ దూరంలో ఉన్న గార్ కౌంటీలో ఇలాంటి మరొక సైట్‌ను కూడా వారు గుర్తించారు.

