98 వేల మొబైల్ టవర్లతో BSNL4G టెక్నాలజీ-ప్రధాని మోదీ
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో..
అమరావతి: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4G సేవలను శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు..ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL 98 వేల మొబైల్ టవర్లతో నెట్‌వర్క్ ను విస్తరించింది..ఈ విస్తరణతో ప్రతి రాష్ట్రంలోని వినియోగదారులకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది.ఈ 4G సర్వీసుల ప్రారంభంతో BSNL పాన్-ఇండియా 4G కవరేజీని అందించే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడనున్నది. సెప్టెంబర్ 26న, BSNL తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.. కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు సమీప భవిష్యత్తులో మరో లక్ష టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
ఆత్మనిర్బరత:– BSNL 4G పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై అభివృద్ధి చేశారు.. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రెండూ భారత్‌లోనే అభివృద్ధి చేశారు.. టెలికాం మౌలిక సదుపాయాలను స్వావలంబనతో అభివృద్ధి చేసిన స్వీడన్, డెన్మార్క్, చైనా, దక్షిణ కొరియాతో పాటు టాప్ 5 దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది.. ఈ స్వదేశీ నెట్‌వర్క్ ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.37 వేల కోట్లను ఖర్చు చేసింది.
2030 నాటికి 6G టెక్నాలజీ:- భారత్‌లో 5G, 6Gకి రోడ్‌మ్యాప్:-BSNL 5G విస్తరణకు సిద్ధమవుతోంది.. ఈ సంవత్సరం చివరి నాటికి ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో 5G నెట్‌వర్క్ ప్రారంభం కావచ్చు.. 5G నెట్‌వర్క్ విస్తరణతో పాటు 2030 నాటికి 6G టెక్నాలజీ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.. 6 G విస్తరణ ఆచరణలోకి వచ్చినట్లయితే 6 G సేవలను అందించే మొదటి దేశాలలో భారత్ ఒకటిగా మారనుంది..