మహారాష్ట్ర లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ స్పష్టమైన అధిక్యంలో బీజెపీ
బీజెపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న దేశ ప్రజలు..
అమరావతి: దేశ ప్రజలు బీజెపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్న సూచనలు స్పష్టంగా కన్సిస్తున్నాయి. ఇందుకు నిదర్శంన మొన్న కమ్యునిస్టుల కంచుకోట కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువునంతరపురం మునిసిపాల్టీలో విజయం సాధించిన బీజెపీ,,నేడు మహారాష్ట్ర లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిలో బీజేపీ తిరుగులేని అధిక్యత చాటుతోంది. మొత్తం 288 స్థానిక సంస్థలకు (246 మున్సిపల్ కౌన్సిళ్లు, 42 నగర పంచాయతీలు) రెండు దశలుగా డిసెంబర్ 2, డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించగా, ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ మొదలైంది..
బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యత:- మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 59 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. విపక్ష మహాకుటమి 49 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కూటమిలోని కాంగ్రెస్ 32 స్థానాల్లో అధిక్యత సాగిస్తోంది.

