భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన బ్యాంకు
అమరావతి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలోని మండి జిల్లాలోని తునాగ్ పట్టణంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు, జూన్ 20 నుంచి జూలై 6 వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది.. సహకార బ్యాంకుపై నమ్మకంతో సమీప పట్టణాల నుంచి వచ్చే వ్యాపారులతో సహా వందలాది మంది ఖాతాదారులు తమ ఆదాయాన్ని ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు..ప్రజలు తమ జీవితకాల పొదుపు డబ్బుతో పాటు, పత్రాలు,బంగారు ఆభరణాలకు దాచుకుంటారు..రెండంతస్తుల బ్యాంకు భవనంలోని మొదటి అంతస్తు మొత్తం నీరు,,బురద,,శిథిలాలతో నిండి ఉంది.. నీటి ప్రవాహం ఎంతగా ఉందంటే, ఒక వైపున ఉన్న షట్టర్‌ను కొట్టుకుని పొగా, మిగిలిన రెండు షట్టర్‌లు వంకరగా ఉన్నాయి.. నష్టం ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత లేదు..బ్యంకులో కోట్ల విలువైన ఆభరణాలు,,నగదు,,పత్రాలు ఉన్నాయి.. శిథిలాలను తొలగించిన తర్వాత, నష్టాన్ని అంచనా వేస్తారని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు.. దీంతో వ్యాపారులు, ఖతాదారులు ఆందోళన చెందుతున్నారు.. వరదల వల్ల బ్యాంకు నుంచి కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు స్థానికులు అక్కడ కాపలా ఉన్నారు.