అంతరిక్ష కేంద్రం దిశగా ప్రయాణం ప్రారంభించిన వ్యోమగామి శుభాంశు శుక్లా
అమరావతి: భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి ప్రయాణం మరో ముగ్గురు వ్యోమగాములతో పాటు ప్రారంభం అయింది..యాక్సియం-4 మిషన్‌లో భాగంగా, ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది..కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సుల్ విడిపోయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) దిశగా ప్రయాణం కొనసాగించింది..వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది..అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.. భూమి కక్ష్యలో గంటకు 28000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతోంది..స్పేస్‌ఎక్స్ వోమనౌక అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ కావాలంటే 28 గంటల సమయం పడుతుంది.. ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కారు.. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు..నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు..ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.

