BUSINESSNATIONALOTHERS

ఆపిల్ ఐ ఫోన్ 17 భారత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం

అమరావతి: Apple iPhone 17 సిరీస్ శుక్రవారం నుంచి భారత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. iphone 17 కొనుగొలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్లలో యువత భారీగా చేరుకున్నారు..ముంబైలోనూ ఆపిల్ BKC స్టోర్‌ వద్ద ఇదే పరిస్థితి కన్పిస్తొంది.. గురువారం రాత్రి నుంచి ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్ల వెలుపల ఐఫోన్ ప్రియులు పొడవైన క్యూలతో కిటకిటలాడుతున్నాయి.

యువకుల మధ్య ఘర్షణ: ముంబై BKC స్టోర్ బయట ఐఫోన్ కొనుగోలుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది..భద్రతా సిబ్బంది రంగంలోకి దిగడంతో ఐఫోన్ కొనుగోలుదారుల మధ్య గొడవ సర్దుమణిగింది.

ఐఫోన్ 17 సిరీస్ ఫీచర్లు: ఐఫోన్ 17 సిరీస్ ఆపిల్ లేటెస్ట్ సిలికాన్ చిప్‌తో వస్తుంది..iOS 26పై రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఏఐ ఫీచర్లు కలిగి ఉంది.ఈ సిరీస్‌లో కేవలం 5.5 మిల్లీమీటర్ల అత్యంత సన్నగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌.

17 సిరీస్ ధరలు: ఐఫోన్ 17 (256GB): రూ. 82,900,,17 (512GB): రూ. 1,02,900,,ఎయిర్ (256GB): రూ. 1,19,900,,ఎయిర్ (1TB): రూ. 1,59,900,,17 ప్రో (256GB): రూ. 1,34,900,,17 ప్రో మాక్స్ (256GB): రూ. 1,49,900,,17 ప్రో మాక్స్ (2TB): రూ. 2,29,900లుగా వున్నాయి.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *