NATIONALOTHERSWORLD

తడిచి మోపిడి అవుతున్న అమెరికా ఒక రోజు యుద్దం ఖర్చు రూ.8.300 కోట్టు

అమరావతి: ఇరాన్ పై భయకంరమైన బాంబులు వేసి, సర్వనాశనం చేస్తామంటూ రంకెలు వేస్తున్న అమెరికాకు, ప్రతి రోజు యుద్దం చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు (రూపాయల్లో-8.300 కోట్లు) 900 మిలియన్లు. నాలుగు రోజుల్లో ఇరాన్ మెడలు వంచుతామని భావించిన అమెరికాకు,ఇరాన్ ఎదురు అవుతున్న ప్రతిఘటన చూసి ఇప్పుడు దిక్కు తొచని పరిస్థితి ఏర్పాడుతొంది. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అనే సంస్థ నివేదిక ప్రకారం అమెరికరా ఈ యుద్ధం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. శుక్రవారం నాటికి ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమై 7 రోజులు అయింది. ఇప్పటి వరకు  యుద్ధం కోసం చేసిన ఖర్చుపై అంచనాల్ని ఈ నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన మొదటి 100 గంటల్లోనే అమెరికా 3.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే ఈ వారం రోజులపాటు సగటున రోజుకు 900 మిలియన్ డాలర్లు ఖర్చైంది.ఇప్పటికే వాడిన ఆయుధాల స్థానంలో కొత్తవి రూపొందించేందుకు భారీగా ఖర్చవుతుంది. అదనంగా 3.1 బిలియన్ డాలర్లు అవసరం. రోజుకు 758 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుద్ధంలో వినియోగిస్తున్నారు.

ఫైటర్ విమానాల కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్‌కు అదనం. అంటే ఈ నిధుల కోసం అమెరికా రక్షణ శాఖ మళ్లీ నిధుల్ని అడగాల్సి ఉంటుంది. దీనికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపాలి. అదనంగా నిధులు కోరితే ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు. నిధులు లేకపోతే యుద్ధాన్ని కొనసాగించడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే అమెరికా ప్రజల్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడం వంటి వాటిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు ట్రంప్‌కు త్వరలోనే ఎదురు దెబ్బ తగిలే అవకాశం వుండ వచ్చని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *