దేశీయంగానే AK-203 రైఫిల్స్ తయారీ-ప్రధాని మోదీ
నోయిడాలో UPITS-2025..
అమరావతి: భారతదేశ రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు..గురువారం ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (UPITS-2025) సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, భారత సైన్యం ఆత్మనిర్భర్ లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆశిస్తుట్టు తెలిపారు..యు.పీలో జరుగుతున్న అభివృద్ధి, భారత రక్షణ రంగంలో స్వదేశీ ఆలోచన బలపరుస్తూ, ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మార్చనుందని ప్రధాని చెప్పారు.. మన సైన్యం స్వయం సమృద్ధిని సాధించాలని, విదేశీ మూలాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశంలో బలమైన రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం పనిచేస్తుంది అన్నారు..
ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ కారిడార్ గా:- ప్రతి ఉత్పత్తి ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని,,ఈ లక్ష్యంకు చేరుకోవాడనికి ఉత్తర్ ప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.. రష్యా సహాయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.. ఉత్తర్ ప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్ అభివృద్ధి చేస్తున్నామని,,ఇక్కడ బ్రహ్మోస్ మిస్సైళ్లు,, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే జరుగుతోందని తెలిపారు..ఇందులో భాగంగానే UPITS-2025, ‘అల్టిమేట్ సోర్సింగ్ బిగిన్స్ హియర్’ అనే థీమ్‌తో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.. అంతర్జాతీయీకరణపై దృష్టిపెడుతూ,, విదేశీ కొనుగోలుదారులు, దేశీయ B2B, B2C కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.. రాష్ట్రంలోని వైవిధ్యమైన, ఆధునిక పరిశ్రమలు, MSMEలు, కొత్త ఆర్థికవ్యవస్థలను సృష్టించబోతున్నాయని ప్రధాని వెల్లడించారు..