అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానం
అమరావతి: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం విమానం కూలిపొయింది..ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం..ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. ఫ్లయిట్ రేడార్ 24 అనే సంస్థ 08:08:51 UTC సమయంలో తమకు చివరి సిగ్నల్ అందినట్లు పేర్కొన్నారు..టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకన్లలోనే విమానం కూలినట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మధ్య నడుస్తున్న విమానం నంబర్ AI 171 ఈరోజు ఒక సంఘటనకు గురైందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం టేకాఫ్ తీసుకున్న తరువాత ఎత్తుకు చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్న వీడియోలో, విమానం నేలను ఢీకొట్టి, అగ్నిగోళంలో పేలిపోతున్నట్లు చూపిస్తుంది.టేకాప్ తీసుకున్న తరువాత విమానం దాదాపు ఐదు నిమిషాలు ఎగిరింది.. మధ్యాహ్నం 1.38 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. అందులో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నాట్లు సమాచారం.. సదరు విమానంను నడుపుతున్న కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కు 8,200 గంటల విమానాలు నడిపిన అనుభవం ఉన్నది..అలాగే కోపైలట్‌కు 1,100 గంటలు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది.. ATC తెలిపిన వివరాల ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుంచి 1339 IST (0809 UTC)కి రన్‌వే 23 నుంచి టేకాఫ్ తీసుకుంది..పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి వుంది.?

