ఏఐ దుర్వినియోగం చేస్తే విధ్వం అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు-ప్రధాని మోదీ
అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందన్న అభిప్రాయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసమీక్షించేలాంటి ఏర్పాట్లు ఉండాలని అన్నారు. గురువారం ప్రధాని మోదీ,దేశ రాజధాని ఇంద్రప్రస్తలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు లో ప్రసంగించారు. మానవ అభివృద్ధిలో AI కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని వెల్లడించారు. ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉందని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని పేర్కొన్నారు. కృత్రిమ మేథను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని దిని ఫలితం రాబోయే రోజుల్లో భారత్‌లో AI పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు.
దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి:- కృత్రిమ మేథకు పరివర్తన శక్తి ఉందన్న ప్రధాని,,దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని, అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందన్నారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో AI ఏం చేయగలదో కాదు?ఝ ప్రస్తుతం కృత్రిమ మేథను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్న అని అన్నారు.
AI నిర్మాణం మన లక్ష్యం కావాలి:- ప్రజా సంక్షేమం, శ్రేయస్సే AIకి మన బెంచ్‌మార్క్ లు అని, మానవ కేంద్రీకృత AI నిర్మాణం మన లక్ష్యం కావాలని ప్రధాని అకాంక్షించారు. కృత్రిమ మేథ మనల్ని శాసించకూడదని, మనమే AIని శాసించాలని మోదీ కోరారు.కృత్రిమ మేథ వినియోగంలో ‘మానవ్ (MANAV) విజన్’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మానవ్ (MANAV) విజన్:-
M – మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్:– నైతిక విలువలు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశనం చేయాలి.
A – అకౌంటబుల్:– పారదర్శక నిబంధనలతో, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలి.
N – నేషనల్ సావర్నిటీ:– ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికే చెందాలి. ఆ దేశ పరిధిలోనే ఉండాలి.
A – యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్:– AI వ్యవస్థలు గుత్తాధిపత్యంతో పనిచేయకుండా అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి రావాలి.
V – వ్యాలిడ్ అండ్ లెజిటిమెట్:– AI చట్టబద్ధంగా, విశ్వసనీయమైనదిగా పనిచేయాలి. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ అన్నారు.

