డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ల ఆసలు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి-మంత్రి నిర్మలాసీతారామన్
అమరావతి: స్మగ్లింగ్ నెట్‌వర్క్ ను నిర్మూలించడానికి అధికారులు ప్రణాళక బద్దంగ పనిచేయాలని,,డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్‌ల ఆసలు సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను కోరారు..డిఆర్‌ఐ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్బంలో మంత్రి మాట్లాడుతూ తక్కువ స్థాయి స్మగ్లింగ్ వ్యక్తులను పట్టుకోవడంతో సంతృప్తి చెందడానికి బదులుగా, నేరానికి మూలకారణాన్ని కనుగొని కేసును ముగింపునకు తీసుకురావాలని DRI అధికారులకు చెప్పారు..ప్రస్తుత పరిస్థితిల్లో స్మగ్లర్స్ చిన్న పట్టణాల్లోని స్కూల్స్ ,కాలేజీల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నరని అలాంటి వారిని అరికట్టాలంటే రాష్ట్రస్థాయిలో పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు..అక్కడ కేసులను గుర్తించడం మాత్రమే కాదు,స్మగ్లింగ్ మాఫియా వెనుకు వున్న మొత్తం నెట్‌వర్క్ ను ఛేదించడమే లక్ష్యం కావాలన్నారు.. నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను..మీరు చిన్న చేపలను పట్టుకునేందుకు ప్రత్నిస్తుంటే,,పెద్ద పెద్ద తిమింగళాలు తప్పించుకుంటున్నయని,,అలాంటి వారిని పట్టుకున్నప్పుడే కొంత మేరకు డ్రగ్స్ మాఫియా అదుపులోకి వస్తుందన్నారు..నేను రెండు కేసులను గమనించడం జరిగింది,,మీరు కేసుల చివరి దశకు తీసుకెళ్లే వరకు నేను వేచి చూశానని,,అయితే ఈలాంటి కేసుల ముగింపు అంటే మొదట దోషులను శిక్షించాలి,, రెండవది కేసు సూత్రధారిని కనుగొని” చట్టం ముందు నిలపాలని కోరారు..ఇలాంటి కేసుల్లో కొత్త టెక్నాలాజీని విసృత్తంగ వాడాలన్నారు.