NATIONAL

ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికేట్ ప్రూప్ గా అమోదించం-యు.పి-మహారాష్ట్ర

అమరావతి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,, మ‌హారాష్ట్ర ప్రభుత్వాలు బ‌ర్త్ స‌ర్టిఫికేట్ జారీ చేయడం కోసం ఆధార్ కార్డుల‌ను ప్రూఫ్‌గా ఆమోదించ‌బోమ‌ని పేర్కొన్నాయి. ఆధార్ కార్డుకు బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌ను ప్రమాణికంగా తీసుకోవడం లేద‌ని, దాన్ని జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రంగా భావించ‌డం లేద‌ని ఉత్తరప్రదేశ్ ప్లానింగ్ శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అమిత్ సింగ్ బ‌న్సాల్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. ఆధార్ కార్డును జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రంగా లేదా డేట్ ఆఫ్ బ‌ర్త్‌ కు ప్రమాణికంగా ఆమోదించ‌డం లేద‌ని స్పష్టం చేశారు..

మ‌హారాష్ట్ర ప్రభుత్వం కూడా బ‌ర్త్ స‌ర్టిఫికేట్ జారీ చేసేందుకు ఆధార్ కార్డును ఓ డాక్యుమెంట్‌గా ఆమోదించ‌బోమ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. జ‌న‌న‌, మ‌ర‌ణ రిజిస్ట్రేష‌న్ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2023 త‌ర్వాత ఆధార్ కార్డు ఆధారంగా న‌మోదు అయిన బ‌ర్త్ స‌ర్టిఫికేట్ల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆధార్ కార్డుల‌తో అనుమానాస్ప‌ద రీతిలో జారీ చేసిన అన్ని స‌ర్టిఫికేట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర రెవ‌న్యూ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ బావ‌న్‌కులే తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌కిలీ జ‌న‌న ప‌త్రాలు జారీ చేసిన ఆఫీస‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.అక్ర‌మంగా జ‌రుగుతున్న న‌కిలీ జ‌న‌న, మ‌ర‌ణ‌ ద్రువ‌ప‌త్రాల జారీని అడ్డుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *