దట్టమైన అడవిలో తన ఇద్దరు పిల్లలతో గుహాలో నివాసిస్తున్న రష్యా మహిళ
అమరావతి: ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని దట్టమైన అడవిలోని రామతీర్థ కొండల్లో ఒక మారుమూల గుహ నుంచి 40 ఏళ్ల రష్యన్ మహిళ,, ఆమె ఇద్దరు చిన్న పిల్లలను పోలీసులు రక్షించారు..ఇక్కడ వారు దాదాపు రెండు వారాలుగా ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం..వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడే అవకాశం వుండడంతో జూలై 9న పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ పోలీస్టేన్ ఎస్.ఐ శ్రీధర్ తన సిబ్బందితో రామతీర్థ కొండ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు..ఇదే సమయంలో పోలీసులకు గుహా ప్రాంతంలో బట్టలు ఆరవేసి వుండడం చూసి పరిసరాలను పరిశీలించగా,, అక్కడి గుహలోని నివసిస్తున్న రష్యా మహిళ, ఆమె కుమార్తెలను గమనించారు..
ఆధ్యాత్మిక జీవితం:- రష్యా మహిళను 40 ఏళ్ల నీనా కుటినా, ఇద్దరు కుమార్తెలను ప్రేమ(6),,అమా(4)గా పోలీసులు గుర్తించారు.. ఆమెను ప్రశ్నించగా గోవా నుంచి ఇక్కడకు చేరుకుని గుహలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లు తెలిపింది.. పాస్‌పోర్ట్,, వీసా పత్రాలు ఆ గుహలో ఎక్కడో పోయినట్లు తెలిపింది..విషపూరిత పాములు, మృగాలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఆ ప్రాంతం నుంచి వారిని తరలించారు..రష్యా మహిళ అభ్యర్థన మేరకు బంకికోడ్ల గ్రామంలోని మహిళా సన్యాసి యోగరత్న సరస్వతి ఆశ్రమానికి వారిని తరలించారు.. గోకర్ణ పోలీసులు,, అటవీ శాఖ అధికారులు కలిసి ఆ గుహలో సోదా చేయగా రష్యా మహిళకు సంబంధించిన పాస్‌పోర్ట్,, వీసా పత్రాలు లభించాయి..2017 ఏప్రిల్ 17 వరకు గడువు ఉన్న బిజినెస్ వీసాపై నీనా భారత్‌కు వచ్చినట్లు వాటి ద్వారా తెలిసింది.. 2018 ఏప్రిల్ 19న గోవాలోని విదేశీ కార్యాయలం భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆమెకు చెప్పింది..అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన రష్యా మహిళ తిరిగి సెప్టెంబర్ 8న తిరిగి భారత్‌కు వచ్చినట్లు ఆమె రికార్డుల ద్వారా పోలీసులు కనుగొన్నారు.. వీసా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రష్యా మహిళ,, ఆమె ఇద్దరు కుమార్తెలను కార్వార్‌లోని మహిళా రిసెప్షన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు.. వారిని రష్యాకు తిరిగి పంపేందుకు బెంగళూరులోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఉత్తర కన్నడ పోలీస్ అధికారి వెల్లడించారు.