పోలీసుల నిఘాలో 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు
అమరావతి: గత కొంత కాలంగా యూట్యూబర్లు సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటుంది..వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలను అప్ లోడ్ చేయడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి..కొంత మంది అయితే దేశ భద్రతకు సంబంధించిన విషయాలను కూడా వీడియోల రూపంలో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు..ఇలాంటి వారి పని పట్టేందుకు పంజాబ్‌కు చెందిన 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు పోలీసుల నిఘాలో వుంచారు..దేశభధ్రతకు సంబంధించిన కంటెంట్ ను, పొరుగు దేశంకు అందచేసే యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్ల పేజీలను పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. .ంజాబ్ పోలీసులు ఈ ప్రాతిపదికననే కాకుండా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, కారిడార్లు అత్యంత సైనిక స్థావరాలు, సరిహద్దు ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాల ప్రస్తుత పరిస్థితిని వీడియో కంటెంట్ ద్వారా పంచుకోవడం ద్వారా వారు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారు..ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు ఇప్పుడు ఈ 823 మంది యూట్యూబర్లు ట్రావెల్ బ్లాగర్ల పూర్తి జాతకాన్ని,,ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు…అలాగే దేశ వ్యాప్తంగా నిఘ విభాగం వేల సంఖ్యలో వున్న యూట్యూబర్లు జాతకలపై ఒక కన్నేసి వుంచినట్లు సమాాచారం.