CRIMENATIONAL

దేశంలో భారీ ఉగ్రదాడులకు కుట్ర-8 మంది అరెస్ట్

అమరావతి: దేశంలో మతోన్మాదంను రెచ్చకొట్టి ఉగ్రదాడులకు పాల్పపడేందుకు ఇటీవల దిల్లీ మెట్రో సహా దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంతికించారు. ఆ పోస్టర్లలో కశ్మీర్‌కు సంబంధించిన ఉద్రిక్త అంశాలు ఉండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ పోస్టర్ల గురించి తెలుసుకునేందురు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీసులు, తమిళనాడు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ నెట్‌వర్క్‌ ను గుర్తించారు. తిరుప్పూర్​లోని వస్త్ర కర్మాగారాల్లో పని చేస్తున్న ఆరుగురు వ్యక్తులు,,8 మొబైల్ ఫోన్లు,,16 సిమ్ కార్డలు,,నకిలీ ఆధార్​ కార్డులతో చెలమాణి అవుతున్నట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. తిరుప్పూర్​కు చేరుకున్న స్పెషల్ సెల్​ పోలీసులు,,స్థానిక పోలీసుల సాయంతో 6 మందిని ఆరెస్ట్ చేశారు.

ఢిల్లీకి తరలింపు:- తిరుప్పూర్​లోని ఉతుకులి నుంచి ఇద్దరు, పల్లడం నుంచి ముగ్గురు, తిరుమురుగన్‌పూండి ప్రాంతం నుంచి ఒకరు అరెస్టయ్యారు. మిజానుర్ రెహమాన్, మహ్మద్ షబత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్‌గా గుర్తించారు. ఇదే సమయంలో బెంగాల్​ నుంచి మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అరెస్ట్ అయిన వారిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులని, వారు తమ అసలు గుర్తింపును దాచి పెట్టి, నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెన్ట్ చేసిన వీళ్లను తదుపరి విచారణ కోసం రైలులో దిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *