పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో పీఓకేలో 8 మంది పౌరులు మృతి
అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన భారీ నిరసనలు 3వ రోజూ కూడా కొనసాగుతున్నాయి.. బుధవారం జరిగిన నిరసనల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాగ్ జిల్లా ధీరకోట్‌లో 4, ముజఫకాబాద్, మీర్‌పూర్‌లో 2+2 పౌరులు, పాక్ బలగాల కాల్పుల్లో మృతి చెందారు.
POK లోని ప్రజలకు ప్రాథమిక హక్కులు లేవని,, గత 70 సంవత్సరాలుగా తమ హక్కుల కోసం నిరసనలు తెలుపుతునే వున్నామని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపింది.JACC ఇచ్చిన పిలుపుతో సోమవారం నుంచి నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి. ఫలితం…. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డగా, రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ,వారు ముజఫరాబాద్ వైపు వెళ్లకుండా వంతెనపై అడ్డంగా నిలిపి ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను దిగువన ఉన్న నదిలోకి తొసివేస్తున్నారు. ముజఫరాబాద్‌లో నిరసనకారులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు షెల్లింగ్ చేయడంతో,పలువురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని జేఏసీసీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్ధులకు పీఓకే అసెంబ్లీలో 12 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేయడాన్ని రద్దు చేయడంతో సహా 38 డిమాండ్లపై ముజఫరాబాద్ ‘లాంగ్ మార్చ్’కు జేఏసీసీ పిలుపునిచ్చింది.