ముంబై,మాలేగావ్ పేలుడు కేసులో 7 మంది నిర్దొషులే-కోర్టు
అమరావతి: ముంబైలోని మాలేగావ్ పేలుడు కేసులో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ,,బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ తో సహా మొత్తం 7 మందిని NIA కోర్టు నిర్దోషులుగా తేల్చింది..2008 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని నాసిక్‌లో గల మాలేగావ్‌లో మసీదుకు సమీపంలో భారీ పేలుడు సంభవించింది..ఈ కేసును మొదట యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) దర్యాప్తు ప్రారంభించింది..అటు తరువాత కేసు దర్యాప్తు బాధ్యతలను NIA చేపట్టింది..ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించారు..ఈ సంఘటనపై 17 సంవత్సరాల పాటు సుధీర్ఘమైన విచారణ జరగిన అనంతరం నేడు జస్టిస్ ఏకే లహోటి తీర్పును వెలువరించారు..ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌తోపాటూ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్,,మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్,,సుధాకర్ చతుర్వేది,,అజయ్ రహిర్కర్,, సుధాకర్ ధర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య,, సమీర్ కులకర్ణిలను నిర్దోషులుగా విడుదల చేసింది.

