ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా 60 మంది గల్లంతు
అమరావతి: ఉత్తరాఖండ్ ఉత్తర్‌కాశీ జిల్లా థరాలీ గ్రామంలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది.. క్లౌడ్ బరస్ట్ కారణంగా గ్రామాన్ని మెరుపు వరదలు ముంచేత్తాయి..పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి..మంగళవారం భారీ వర్షాల కారణంగా గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.. ఖీర్ గంగా నది ప్రవాహం ఉహించని విధంగా ఉప్పొంగడంతో చాలా మంది గ్రామాస్తూలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.. పదుల సంఖ్యలో గృహాలు వరద బురద మేట కింద కూరుకుపోయాయి..60 మంది గల్లంతూ కాగా శిధిలాల్లో మరికొందరు చిక్కుకున్నారని అధికారులు పేర్కొంటున్నారు.. పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, సైన్యం సంఘటన స్థలంలో సహాయ కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయని,,ఉత్తరకాశి పోలీసులు తెలిపారు.. ఉత్తరకాశిలో క్లౌడ్ బరస్ట్ సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తంచేశారు.. “ఉత్తరకాశిలోని ధరాలిలో క్లౌడ్ బస్ట్ సంఘటన గురించి నాకు ఇప్పడే సమాచారం అందింది.. మేము ప్రజలను రక్షించడానికి కృషి చేస్తున్నారు..
హిమాచల్‌ప్రదేశ్‌లో:- పొరుగు రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో 310 రహదారులతోపాటు పలు జాతీయ రహదారులను మూసివేశారు..రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది..మరోవైపు గంగోత్రికి వెళ్లే మార్గం భారీ వరదల కారణంగా కొట్టుపోయింది.. దీంతో ఆ ప్రాంతంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి..

