NATIONAL

బస్తర్ డివిజన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిన 51 మంది మావోయిస్టులు

అమరావతి: జనజీవన స్రవంతి కలసిపోయేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు,, ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో లొంగిపోయిన 51 మంది మావోయిస్టులను చూస్తూంటే ఆర్దం అవుతొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధించిన గడవు దగ్గర పడుతున్నకొద్ది వీరి సంఖ్య వీపరితంగా పెరిగిపోతుందా అంటే అవును అనే సంకేతలు కన్పిస్తున్నాయి.నేడు లొంగిపోయిన మావోయిస్టులపై దాదాపు రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో శనివారం నాడు లొంగిపోయారు. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్‌పూర్‌లో బస్తర్ పాండుమ్ 2026 ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్‌షా రాయపూర్ వచ్చిన రోజునే ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ బస్తర్ జిల్లాలో మావోయిస్టులు ప్రభావం కారణంగా ఎక్కువగా నష్టపోయింది గిరిజనులే అని నేడు గిరిజనులు మావోయిస్టుల భయం నుంచి బయట పడి,వారి భవిష్యత్ కోసం లొంగిపోయేందుకు ముందుకు రావడం అబినందనీయం అన్నారు..

లొంగిపోయిన వారిలో మహిళలే ఎక్కువ:-  బీజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్‌తో సహా 30 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 21 మంది సుక్మా జిల్లాలో లొంగిపోయారని ఎస్పీ సుందరరాజ్ తెలిపారు. వీరిలో 14 మంది మహిళా క్యాడర్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్డెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్‌లో స్వాధీనం చేసుకున్నామన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.50 వేల తక్షణ సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రత, గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావసం కల్పిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *