1974లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి-ప్రధాని మోదీ
కేంద్ర కేబినెట్ సమావేశం..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు..దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని విధ్వసం చేశారన్న తీర్మానాన్ని ఆమోదించారు..తొలుత ఎమర్జెన్సీ సమయంలో అణచివేతకు వ్యతిరేకంగా కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.. కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి వివరించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు..సమావేశంలో మూడు ముఖ్యమైన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.. పూణేలో మెట్రో విస్తరణ కోసం మెట్రో లైన్ 2ను, ఇందుకోసం రూ.3,626 కోట్లు కేటాయించారు.. జార్ఖండ్‌లోని ఝారియా బొగ్గు క్షేత్రాల అభివృద్దికి కోసం రూ.5,940 కోట్లు అలాగే ఆగ్రాలో అంతర్జాతీయ పొటాటో రీజినల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు రూ.111.5 కోట్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం పట్ల శుభంషు శుక్లాను మంత్రివర్గం అభినందించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు..
1974లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధ్వంసం:- భారత రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేయడానికి ఎమర్జెన్సీ అప్పటి ప్రదాని ఇందిరాగాంధీ విధించింది..ఎమర్జెన్సీ విధ్వంసం 1974లో నవనిర్మాణ్ ఉద్యమాన్ని, సంపూర్ణ విప్లవ ప్రచారాన్ని అణిచివేయడానికి జరిగిన కఠినమైన ప్రయత్నంతో ప్రారంభమైంది..రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను హరించిన వారికి, ఆపై ఊహించలేని భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సిన వారికి నివాళిగా కేంద్ర మంత్రివర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.. ఎమర్జెన్సీ పరిస్థితిఅతిక్రమణలకు వ్యతిరేకంగా వారి ఆదర్శప్రాయమైన ధైర్యం, వీరోచిత ప్రతిఘటనకు కేంద్ర మంత్రివర్గం నివాళులర్పించింది.2025 సంవత్సరం రాజ్యాంగ హత్య దివస్ 50వ వార్షికోత్సవాన్ని సూచిస్తుందని, ఇది భారతదేశ చరిత్రలో ఒక మరపురాని అధ్యాయం అని కేంద్ర కేబినెట్ ఆభిప్రాయపడింది.. రాజ్యాంగం నాశనం చేసిన,, భారతదేశ గణతంత్ర, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై దాడి చేయడమే అన్నారు.. సమాఖ్యవాదం బలహీనపడిందని, ప్రాథమిక హక్కులు, మానవ స్వేచ్ఛ, గౌరవం నిలిపివేసిందని కేంద్ర కేబినెట్ పేర్కొంది.