నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 42 మంది మృతి
అమరావతిం నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం,, వరదలు సంభవించడంతో కనీసం 42 మంది మరణించారని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాదాల నిర్వహణ అథారిటీ ప్రతినిధి శాంతి మహత్ ఆదివారం తెలిపారు. శుక్రవారం నుండి దేశంలోని కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి,, దీనితో నదులలో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. “ఇప్పటి వరకు వర్షాల కారణంగా సంభవించిన విపత్తులలో 42 మంది మరణించిగా,5 మంది గల్లంతయ్యారు” అని అథారిటీ అదికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని అధికారులు పేర్కొన్నారు. నేపాల్లో వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ,,మళ్లీ అకాల వర్షాలు ముంచెత్తడంతో వరదలు సంభవించాయని తెలిపారు.
ఖఠ్మాండూ వ్యాలీలోని నదులు (బాగ్మతి, హనుమంతే, మనోహరా మొదలైనవి) నీటి స్థాయిలు పెరిగి, వరదలు, ల్యాండ్‌స్లైడ్‌లకు కారణమవుతున్నాయని హైడ్రాలజీ & మెటియరాలజీ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. కాఠ్మాండూ వ్యాలీలో ప్రధాన నది చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ ఆపరేషన్లకు నేపాల్ ఆర్మీ,, నేపాల్ పోలీసులు నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.అలాగే వాహనదారులు నదీ సమీపంలో ప్రయాణం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.