విమాన ప్రమాదంలో 242 మంది మృతి-ఇంకా పెరిగే అవకాశం
అమరావతి: గురువారం మధ్యహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు.. వారి కాకుండా విమానం కూలిన ప్రాంతంలో ఓ మెడికల్ కాలేజ్ అలాగే రెసిడెన్షియల్ ఏరియా వుంది..ఈ ప్రాంతంలో మిమానం కూలడంతో,,విద్యార్దులు ఎవరైన మరణించార అనే విషయంపై అధికారుల నుంచి స్పష్టత రాలేదు..మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది..ప్రమాదం నుంచి ఎవరూ బ్రతలేదని అహ్మదాబాద్ పోలీసు కమీషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు..అంతర్జాతీయ మీడియా సంస్థ ద అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.. బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదం వల్ల మొత్తం ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, దానిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు..

ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడు మంది పోర్చుగీస్, ఓ కెనడా దేశస్థుడు ఉన్నారు.. అహ్మదాబాద్‌లోని మేఘనీనగర్ ఏరియాలో ఉన్న దార్‌పుర్‌లో విమానం కూలింది.. ఎమర్జెన్సీ బృందాలు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి..ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అధికారులు ఇంకా నిర్ధారించలేదు..ఈ విమానంలో ప్రయాణిస్తున్న మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందినట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
Help line-విమానయానశాఖ కంట్రోల్ రూమ్- 011-24610843, 9650391859…ఎయిరిండియా హెల్ప్ లైన్- 1800 5691 444….అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు హెల్ప్ లైన్: 99741 11327

