కల్తీ మద్యం కారణంగా 14 మంది మృతి-6 మంది పరిస్థితి విషమం
అమరావతి: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని మజితలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.. అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ “మజితలో దురదృష్టకర విషాదం” జరిగింది.. సోమవారం రాత్రి మాకు సమాచారం అందింది..అమృత్‌సర్ మజితా బ్లాక్‌లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాలకు చెందిన వారు మద్యం సేవించడంతో,,వారి పరిస్థితి విషమంగా ఉందని 5 గ్రామాల నుంచి మాకు నివేదికలు వచ్చాయి..మేము మా వైద్య బృందాలను తరలించాము.. మా వైద్య బృందాలు ఇప్పటికీ ఇంటింటికీ తిరుగుతున్నాయి..ప్రజలకు కొన్ని లక్షణాలు ఉన్నా లేకపోయినా, వారిని కాపాడటానికి మేము వారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము..ప్రభుత్వం సాధ్యమైనంత సహాయం అందిస్తోంది..ఈ మరణాల సంఖ్య పెరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటున్నాము.. కల్తీ మద్యంను సరఫరా చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని,,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.