మంత్రి నారాయణ ప్రత్యేక కృషితోనే విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం-రాష్ట్ర సలహాదారు సతీష్ రెడ్డి
నెల్లూరు: నెల్లూరు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో VR హై స్కూల్లో చూస్తే అద్భుతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్ర సతీష్ రెడ్డి అన్నారు..నగరంలోని విఆర్ హైస్కూల్‌ను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్ కలిసి ఆయన హైస్కూల్ ని సందర్శించారు.. మంత్రి నారాయణ ఎంతో అద్భుతంగా విఆర్ హైస్కూల్‌ను రూపురేఖలు మార్చేశారని తెలిపారు.. పాఠశాలను చూసి ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నారు..
కార్పొరేట్ వసతులతో పెద్ద విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధిస్తున్నట్లు వారు తెలిపారు.. ఇక్కడ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు మంత్రి నారాయణ దత్తత తీసుకోవడం ఎంతోమందికి స్ఫూర్తి దాయకమని తెలిపారు.. మంత్రి నారాయణ ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు… మంత్రి నారాయణ స్ఫూర్తితో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్నారులను దత్తత తీసుకోవాలని తెలిపారు.. వి ఆర్ హై స్కూల్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు..ఈకార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ ,డీఈఓ బాలాజీరావు ,వీఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్రావు ,సిబ్బంది ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి పాల్గొన్నారు.