నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దు-మంత్రి నారాయణ
నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేలా చర్యలతీసుకుంటున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎనిమిదవ డివిజన్లోని స్టోన్ హౌస్ పేటలో ఉన్న ఆర్ఎస్ఆర్ స్కూల్ తో పాటు.. 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకీకరణ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునికీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వి ఆర్ మున్సిపల్ హై స్కూల్ కంటే మెరుగ్గా మౌలిక వసతులు ఉండాలన్నారు.. నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడుద్దని అధికారులను ఆదేశించారు.. తాను తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని.. పనులలో జాప్యం నిర్లక్ష్యం వహించ వద్దన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి, 14 డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి మల్లి,టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

